మా పోలీసులను మాకు అప్పగించండి

మా పోలీసులను మాకు అప్పగించండి

మిజోరం సర్కారును కోరిన మయన్మార్

ఐజ్వాల్: ఇండియాకు పారిపోయి వచ్చిన పోలీసులను తిరిగి అప్పగించాలని మయన్మార్ ప్రభుత్వం కోరింది. ఈమేరకు ఆ దేశ ప్రభుత్వం లేఖ రాసిందని మిజోరం అధికారులు తెలిపారు. మిలటరీ ఆదేశాలను అమలు చేయడానికి ఇష్టపడని 8 మంది పోలీసులు వారి కుటుంబ సభ్యులతో సహా మొత్తం 30 మంది ఇండియాలోకి వచ్చారని మిజోరంలోని చంపై డిప్యూటీ కమిషనర్ తెలిపారు. తమ పోలీసులను తిరిగి అప్పగించాలంటూ మయన్మార్లోని ఫాలం జిల్లా ఆఫీసర్లు లేఖ రాసినట్లు వెల్లడించారు. ‘రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను నిలబెట్టుకునేలా.. ఇండియా భూభాగంలోకి చేరుకున్న 8 మంది పోలీసులను మయన్మార్కు అప్పగించండి’ అని ఫాలం డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు.